Tech

Android vs iPhone: ఒక టెక్నీషియన్ మాట! ఐఫోన్ కంటే ఆండ్రాయిడ్ ఎందుకు బెటర్? (15 Reasons)

January 14, 2026 9:14 AM
Comparison of iPhone storage full warning versus Android high performance battery and widgets in Telugu

Introduction: నేను రోజూ ఎన్నో ఫోన్లను రిపేర్ చేస్తూ, ఓపెన్ చేస్తూ ఉంటాను. ఐఫోన్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఒప్పుకుంటా. కానీ, సామాన్యుడికి ఉపయోగపడే ఫీచర్స్, స్వేచ్ఛ (Freedom) ఎందులో ఎక్కువ అంటే మాత్రం నా ఓటు ఖచ్చితంగా Android కే వేస్తాను. అసలు ప్రాక్టికల్ గా వాడుతుంటే ఆండ్రాయిడ్ ఎందుకు “తోపు” అనిపిస్తుందో, ఈ 15 పాయింట్స్ చదివితే మీకే అర్థమవుతుంది.


1. Budget Friendly & Wide Variety (అందరికీ అందుబాటులో..)

ఒక టెక్నీషియన్‌గా నా దగ్గరికి వచ్చే కస్టమర్లలో అందరూ లక్షలు పెట్టలేరు. ఆండ్రాయిడ్ గొప్పతనం ఏంటంటే..

  • మీ దగ్గర ₹10,000 ఉన్నా మంచి ఫోన్ దొరుకుతుంది, ₹1,00,000 ఉన్నా దొరుకుతుంది.

  • గేమర్స్ కోసం ₹25,000 లో iQOO లాంటి ఫోన్లు, కెమెరా లవర్స్ కోసం Vivo లాంటి ఫోన్లు ఆండ్రాయిడ్ లోనే సాధ్యం. ఐఫోన్ కొనాలంటే ఆస్తి అమ్ముకోవాల్సిన పనిలేదు.

2. Battery Capacity & Fast Charging (గంటలు తరబడి వెయిటింగ్ లేదు!)

ఐఫోన్ వాడేవాళ్ళు ఛార్జర్ల దగ్గర పడిగాపులు కాయాలి. కానీ ఆండ్రాయిడ్ టెక్నాలజీ వేరు.

  • ఇప్పుడు వస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్లలో 120W, 150W Fast Charging ఉంటోంది. బ్రష్ చేసి వచ్చేలోపు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.

  • బ్యాటరీ కెపాసిటీలు కూడా 7,500 mAh దాటిపోయాయి. త్వరలో 10,000 mAh బ్యాటరీలు కూడా రాబోతున్నాయి. ఐఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఆండ్రాయిడ్ బడ్జెట్ ఫోన్ల ముందు కూడా నిలవదు.

3. Customization & APK Installation (నా ఫోన్ – నా ఇష్టం)

ఐఫోన్ ఒక జైలు లాంటిది, వాడు ఇచ్చిందే వాడాలి. కానీ ఆండ్రాయిడ్ మన సొంత ఇల్లు లాంటిది.

  • మీకు నచ్చినట్లు Themes మార్చుకోవచ్చు. బోర్ కొడితే మొత్తం సాఫ్ట్‌వేర్ (Custom ROM) మార్చేయొచ్చు.

  • అన్నిటికంటే ముఖ్యం.. ప్లే స్టోర్ లో లేని యాప్స్ ని కూడా APK Files ద్వారా ఇన్స్టాల్ చేసుకునే స్వేచ్ఛ ఒక్క ఆండ్రాయిడ్ లోనే ఉంది.

4. “Close All Apps” Feature (సింగిల్ క్లిక్ సుఖం)

ఇది చిన్న విషయమే కానీ రోజుకి వంద సార్లు వాడతాం.

  • ఆండ్రాయిడ్ లో “Clear All” బటన్ నొక్కితే బ్యాక్‌గ్రౌండ్ లో ఉన్న యాప్స్ అన్నీ ఒకేసారి క్లోజ్ అవుతాయి.

  • అదే ఐఫోన్ లో అయితే మూడు వేళ్లు పెట్టి స్వైప్ చేస్తూ కూర్చోవాలి. అన్ని యాప్స్ ని ఒకేసారి క్లోజ్ చేసే ఆప్షన్ అక్కడ లేదు.

5. Keyboard & Clipboard Management (టైపింగ్ ఈజీ బాసూ!)

  • Number Row: గూగుల్ కీబోర్డ్ లో నంబర్స్ పైన రెడీగా ఉంటాయి. ఐఫోన్ లో నంబర్స్ కోసం వేరే పేజీకి వెళ్లాలి.

  • Clipboard: మనం కాపీ చేసిన పాత మేటర్ కూడా ఆండ్రాయిడ్ లో సేవ్ అయి ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు పేస్ట్ చేయొచ్చు. ఐఫోన్ లో ఒక్కటి కాపీ చేస్తే పాతది పోయినట్టే.

6. Volume Control Levels (సౌండ్ కంట్రోల్)

ఐఫోన్ లో వాల్యూమ్ తగ్గిస్తే అన్నీ తగ్గుతాయి. కానీ ఆండ్రాయిడ్ లో రింగ్ టోన్ కి ఒక వాల్యూమ్, పాటలకి ఒక వాల్యూమ్, అలారంకి ఒక వాల్యూమ్.. ఇలా విడివిడిగా సెట్ చేసుకోవచ్చు.

Infinix Note Edge JBL Edition smartphone in Solar Orange color with bundled JBL MagPower Speaker launched in India
👉 Infinix Note Edge JBL Edition Launch: ఫోన్‌తో పాటు JBL స్పీకర్ ఫ్రీగా!

7. Multitasking & Split Screen (ఒకేసారి రెండు పనులు)

  • పైన యూట్యూబ్ చూస్తూ, కింద వాట్సాప్ చాటింగ్ చేయాలా? ఆండ్రాయిడ్ లో Split Screen ద్వారా ఇది సాధ్యం.

  • ఐఫోన్ లో ఈ ఫీచర్ ఇప్పటికీ లేదు. అలాగే సైడ్ బార్ నుంచి యాప్స్ ని లాగి పాప్-అప్ విండోలో వాడటం ఆండ్రాయిడ్ లోనే కుదురుతుంది.

8. Navigation Gestures (బ్యాక్ రావడం ఈజీ)

ఆండ్రాయిడ్ లో స్క్రీన్ కి ఎటు వైపు (Right or Left) నుంచైనా స్వైప్ చేస్తే ‘Back’ వెళ్లొచ్చు. ఐఫోన్ లో ఇది అంత ఫ్లెక్సిబుల్ గా ఉండదు, కొన్ని యాప్స్ లో పైన ఉన్న బటన్ నొక్కాల్సిందే.

9. Tap & Pay via NFC (ఇండియాలో ఇదే బెస్ట్)

మీ దగ్గర శాంసంగ్ లేదా NFC ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే, పర్సు (Wallet) మర్చిపోయినా పర్లేదు.

  • జస్ట్ ఫోన్ ని మెషీన్ కి టచ్ చేసి పేమెంట్ చేయొచ్చు. Apple Pay ఇండియాలో పనిచేయదు కాబట్టి ఐఫోన్ యూజర్స్ కి ఈ సౌకర్యం లేదు.

10. Privacy Features & Dual Apps (రెండు వాట్సాప్ లు)

  • ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ లు, రెండు ఫేస్ బుక్ లు వాడాలంటే ఆండ్రాయిడ్ లో Dual Apps ఫీచర్ ఉంది.

  • అలాగే పర్సనల్ డేటా దాచడానికి Private Space, ఎవరైనా ఫోన్ అడిగితే Guest Mode ఆన్ చేసి ఇవ్వడం.. ఇవన్నీ ఆండ్రాయిడ్ లోనే ఉన్నాయి.

11. File Management & Desktop Mode

  • ఆండ్రాయిడ్ ఫోన్ ని కంప్యూటర్ కి కనెక్ట్ చేయడం, ఫైల్స్ కాపీ చేయడం చాలా ఈజీ. కొన్ని ఫోన్లను మానిటర్ కి కనెక్ట్ చేసి కంప్యూటర్ లాగా (Desktop Mode) కూడా వాడుకోవచ్చు. ఐఫోన్ లో ఫైల్ మేనేజ్మెంట్ చాలా తలనొప్పి.

12. Direct Ride Booking (లొకేషన్ లింక్స్)

ఎవరైనా వాట్సాప్ లో లొకేషన్ పంపిస్తే, ఆండ్రాయిడ్ లో డైరెక్ట్ గా ఆ లింక్ ని Uber/Ola యాప్ లో ఓపెన్ చేయొచ్చు. ఐఫోన్ లో అయితే కేవలం మ్యాప్స్ లోనే ఓపెన్ అవుతుంది.

13. Call Recording Support

ఇది మన దగ్గర చాలామందికి అవసరం. ఆండ్రాయిడ్ లో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా లేదా ఇన్-బిల్ట్ గా కాల్ రికార్డింగ్ ఈజీగా చేసుకోవచ్చు. కొన్ని ఫోన్లలో అవతలి వారికి తెలియకుండా కూడా రికార్డ్ చేయొచ్చు.

14. Camera & Indian Skin Tones (ఫోటోల్లో మనం మెరుస్తాం)

వీడియోలో ఐఫోన్ కింగ్ కావచ్చు, కానీ ఫోటోల విషయానికి వస్తే ఆండ్రాయిడ్ (ముఖ్యంగా Vivo, Oppo, Pixel) మన ఇండియన్ స్కిన్ టోన్ ని దృష్టిలో పెట్టుకుని ఫోటోలను బ్రైట్ గా, అందంగా వచ్చేలా చేస్తాయి. ఎడిటింగ్ లేకుండానే సోషల్ మీడియాలో పెట్టేయొచ్చు.

15. AI Features (Google Magic)

పిక్సెల్ లాంటి ఆండ్రాయిడ్ ఫోన్లలో “Add Me” (గ్రూప్ ఫోటోలో మిస్ అయిన వారిని యాడ్ చేయడం) లాంటి మ్యాజికల్ AI ఫీచర్స్ ఉన్నాయి. ఐఫోన్ AI ఇంకా ఇప్పుడిప్పుడే వస్తోంది.


Technician’s Verdict (తుది తీర్పు): బ్రాండ్ వాల్యూ, రీ-సేల్ వాల్యూ కావాలంటే ఐఫోన్ ఓకే. కానీ.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్, ఫ్రీడం, మరియు మన ఇండియన్ యూసేజ్ కి తగ్గట్లుగా ఉండేది మాత్రం ఆండ్రాయిడ్ మాత్రమే. రిపేర్ చేయడానికి కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు, పార్ట్స్ దొరకడం కాస్త ఈజీగా ఉంటుంది.

(మీకు టెక్నికల్ గా ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, మీ మొబైల్ టెక్నీషియన్ సమాధానం ఇస్తాడు!) 🔧📱


👉 Join Our WhatsApp Channel 👈

Q1. సామాన్యుడికి ఐఫోన్ బెస్ట్ ఆ? ఆండ్రాయిడ్ బెస్ట్ ఆ?

Ans: ఖచ్చితంగా ఆండ్రాయిడ్ బెస్ట్. ఎందుకంటే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు కాల్ రికార్డింగ్ వంటి సౌకర్యాలు సామాన్యుడికి ఆండ్రాయిడ్ లోనే దొరుకుతాయి. ఐఫోన్ ధర ఎక్కువ మరియు రిపేర్ కాస్ట్ కూడా ఎక్కువ.

Q2. ఆండ్రాయిడ్ ఫోన్లలో వైరస్ వస్తుందా? సెక్యూరిటీ ఉంటుందా?

Ans: మీరు ప్లే స్టోర్ (Play Store) నుండి యాప్స్ డౌన్లోడ్ చేసినంత వరకు ఆండ్రాయిడ్ చాలా సేఫ్. ఇప్పుడు వస్తున్న శాంసంగ్ (Knox Security) మరియు పిక్సెల్ ఫోన్లలో ఐఫోన్ స్థాయి సెక్యూరిటీ ఉంటోంది

Q3. ఐఫోన్ కంటే ఆండ్రాయిడ్ బ్యాటరీ ఎందుకు బెస్ట్?

Ans: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇప్పుడు 6000mAh నుండి 7000mAh బ్యాటరీలు వస్తున్నాయి. అంతేకాకుండా 120W ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల కేవలం 20 నిమిషాల్లో ఫోన్ ఛార్జ్ అవుతుంది. ఐఫోన్ ఛార్జింగ్ స్పీడ్ దీనితో పోలిస్తే చాలా తక్కువ.

Q4. ఆండ్రాయిడ్ లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉందా?

Ans: అవును, చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇన్-బిల్ట్ కాల్ రికార్డింగ్ ఉంది. కొన్ని ఫోన్లలో (Vivo/iQOO/Samsung) అవతలి వారికి తెలియకుండా కూడా కాల్ రికార్డ్ చేసుకునే సౌలభ్యం ఉంది.

Q5. గేమింగ్ కి ఏది బాగుంటుంది?

Ans: హై-ఎండ్ గేమింగ్ కి ఐఫోన్ బాగుంటుంది కానీ, బడ్జెట్ లో గేమింగ్ ఆడాలంటే ఆండ్రాయిడ్ (iQOO, Poco వంటివి) బెస్ట్ ఛాయిస్. ₹25,000 లోనే మంచి గేమింగ్ ఫోన్లు ఆండ్రాయిడ్ లో దొరుకుతాయి.

Join WhatsApp

Join Now

Sudheer Sayana

Sudheer S | Founder & Lead Author, Taja PointsI am a digital publisher and content creator committed to delivering accurate, reliable, and easy-to-understand information for Telugu readers. Through Taja Points, I share the latest updates on Government Jobs, Government Schemes, Education, and Technology, helping students, job seekers, and everyday citizens stay informed and make better decisions.

Leave a Comment