Tech

OnePlus India Shutting Down? అసలు నిజం చెప్పిన కంపెనీ – Official Statement 2026

January 21, 2026 11:55 AM

OnePlus India బంద్? అసలు నిజం ఇదే!  నిన్నటి నుంచి Social Media లో, WhatsApp గ్రూపుల్లో ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. “OnePlus కంపెనీ ఇండియాలో తన Operations ఆపేస్తుందని, Offline Stores అన్నీ బంద్ అవుతున్నాయని” ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇది చూసి OnePlus Users మరియు ఫ్యాన్స్ ఒక్కసారిగా Shock అయ్యారు.

మీరు కూడా ప్రజెంట్ OnePlus వాడుతున్నారా? లేదా కొత్త ఫోన్ కొనాలని Plan చేస్తున్నారా? అయితే మీకోసం కంపెనీ ఒక Official Statement రిలీజ్ చేసింది. అసలు మేటర్ ఏంటంటే…

అదంతా Fake News! నమ్మకండి

అవును, మీరు విన్నది అబద్ధం. OnePlus ఇండియాలో బంద్ అవ్వడం లేదు. ఈ వార్తల్లో అస్సలు నిజం లేదని OnePlus India టీమ్ క్లియర్‌గా చెప్పేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని నమ్మవద్దని Users ని కోరింది.

Company ఏం చెప్పిందంటే?

ఈ రూమర్స్ పై OnePlus స్పందిస్తూ ఒక నోట్ రిలీజ్ చేసింది: “OnePlus India షట్ డౌన్ అవుతుందని వస్తున్న Reports అన్నీ ఫేక్. మా Business Operations ఎప్పటిలాగే నార్మల్ గా జరుగుతున్నాయి. ఇండియా మాకు చాలా ముఖ్యమైన మార్కెట్. దయచేసి Official Sources నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి, ఇలాంటి పుకార్లను Share చేయకండి.”

అసలు ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయ్యింది?

నిప్పు లేనిదే పొగ రాదు కదా! అసలు ఈ Rumors ఎందుకు వచ్చాయంటే.. గత కొన్ని రోజులుగా సౌత్ ఇండియాలో Mobile Retailers (Offline Shop Owners) కి మరియు OnePlus కి మధ్య ‘Profit Margin’ విషయంలో చిన్న గొడవలు జరుగుతున్నాయి. లాభాలు తక్కువగా ఇస్తున్నారని కొన్ని షాపుల వాళ్ళు OnePlus ఫోన్లు అమ్మడం ఆపేశారు.

దీన్ని చూసి చాలామంది “ఓహో.. కంపెనీనే ఇండియా నుంచి వెళ్ళిపోతోందేమో” అని తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే చివరికి ఇలా “OnePlus Shut Down” అనే Fake News లా మారింది.

Infinix Note Edge JBL Edition smartphone in Solar Orange color with bundled JBL MagPower Speaker launched in India
👉 Infinix Note Edge JBL Edition Launch: ఫోన్‌తో పాటు JBL స్పీకర్ ఫ్రీగా!

OnePlus India official statement

Users కి మా సూచన:

  1. Warranty: మీ దగ్గర ఉన్న OnePlus మొబైల్స్ కి వారంటీ ఎప్పటిలాగే వర్తిస్తుంది. No Tension!

  2. Service Centers: దేశవ్యాప్తంగా సర్వీస్ సెంటర్స్ Active గానే ఉన్నాయి.

  3. Sales: Amazon, Flipkart మరియు OnePlus వెబ్‌సైట్ లో సేల్స్ మామూలుగానే జరుగుతాయి.

సో, అనవసరంగా టెన్షన్ పడకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ రూమర్స్ నమ్మి కంగారు పడుతుంటే, వాళ్ళకి ఈ లింక్ షేర్ చేసి నిజం చెప్పండి!

Join WhatsApp

Join Now

Sudheer Sayana

Sudheer S | Founder & Lead Author, Taja PointsI am a digital publisher and content creator committed to delivering accurate, reliable, and easy-to-understand information for Telugu readers. Through Taja Points, I share the latest updates on Government Jobs, Government Schemes, Education, and Technology, helping students, job seekers, and everyday citizens stay informed and make better decisions.

Leave a Comment