Tech Mobile Buying Guide

రూ. 15,000 బడ్జెట్లో బెస్ట్ మొబైల్స్ ఇవే: కొత్త ఫోన్లు కొని మోసపోకండి! (Technician Guide 2026)

March 13, 2026 10:03 AM
Top 5 Best Phones Under 15000 in Telugu (2026) - Taja Points by Sudheer Sayana

ప్రస్తుతం మొబైల్ మార్కెట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొత్తగా లాంచ్ అవుతున్న ఫోన్లలో ధరలు అమాంతం పెంచేస్తున్నారు, కానీ ఫీచర్స్ మాత్రం దారుణంగా డౌన్‌గ్రేడ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రూ. 15,000 బడ్జెట్లో ఒక మంచి వ్యాల్యూ ఫర్ మనీ (Value for Money) ఫోన్ కనుక్కోవడం కష్టంగా మారింది. ఒక టెక్నీషియన్‌గా మార్కెట్లో ఉన్న అన్ని ఫోన్లను పరిశీలించి, మీకు బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చే టాప్ 5 స్మార్ట్‌ఫోన్ల లిస్ట్ ఇక్కడ అందిస్తున్నాను.

Top 5 Best Phones Under Rs 15,000

1. Motorola G57 Power

ఈ ఫోన్ చాలా అండర్-రేటెడ్ అని చెప్పాలి. ఫ్యూచర్‌లో ఈ బడ్జెట్లో ఇలాంటి ఫీచర్స్ రావడం కష్టం.

7000mAh బ్యాటరీ & 33W ఛార్జర్, డ్యూయల్ స్పీకర్స్.
పవర్‌ఫుల్ Snapdragon 6s Zen4 ప్రాసెసర్ (LPDDR4X, UFS 2.2).

ఇందులో FHD+ 120Hz LCD డిస్ప్లే ఉంది. 50MP మెయిన్ కెమెరాతో పాటు LYT 600 అల్ట్రావైడ్ సెన్సార్ ఉండటం ఈ బడ్జెట్లో చాలా రేర్. (గమనిక: ఆండ్రాయిడ్ 16 తో వస్తుంది, కానీ అప్‌డేట్స్ కేవలం ఆండ్రాయిడ్ 17 వరకే వస్తాయి).

1. Motorola G57 Power

2. Lava Play Ultra

న ఇండియన్ బ్రాండ్ లావా నుంచి వస్తున్న బెస్ట్ వాల్యూ ఫోన్ ఇది. ముఖ్యంగా డిస్ప్లే లవర్స్ కి ఇది బెస్ట్ ఛాయిస్.

అద్భుతమైన ఫ్లాట్ AMOLED డిస్ప్లే & ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్.
ఫాస్ట్ MediaTek Dimensity 7300 చిప్‌సెట్ (UFS 3.1 స్టోరేజ్).

ఇందులో 64MP బ్యాక్ మరియు 13MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి (రెండింటిలో 4K వీడియో సపోర్ట్ ఉంది). 5000mAh బ్యాటరీ, 33W ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 2 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ ఇస్తున్నారు.

Lava Play Ultra

3. Vivo T4x / iQOO Z10x

దీని నెక్స్ట్ వెర్షన్స్ కంటే ఈ ఫోన్లే (సుమారు 15 వేల లోపు) అద్భుతమైన వాల్యూ ఇస్తున్నాయి.

6500mAh భారీ బ్యాటరీ & 44W ఫాస్ట్ ఛార్జింగ్.
గేమింగ్ కోసం బెస్ట్ Dimensity 7300 ప్రాసెసర్ & డ్యూయల్ స్పీకర్స్.

120Hz పంఛ్-హోల్ LCD డిస్ప్లే తో వస్తుంది. 50MP మెయిన్ కెమెరాతో 4K వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఫ్రంట్ 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

3. Vivo T4x  iQOO Z10x

4. POCO M7 P+

కేవలం రూ. 14,000 బడ్జెట్ రేంజ్‌లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్మార్ట్‌ఫోన్.

WhatsApp Instagram Facebook and Messenger new football themed features for FIFA World Cup 2026
👉 WhatsApp, Instagram, Facebookలో భారీ మార్పులు.. FIFA World Cup 2026 కోసం Meta కొత్త ఫీచర్లు!
7000mAh బ్యాటరీ & 144Hz రిఫ్రెష్ రేట్ IPS FHD+ డిస్ప్లే.
Snapdragon 6s Zen3 ప్రాసెసర్ & HyperOS 2 అప్‌డేట్స్.

ఇందులో 50MP మెయిన్ మరియు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి (రెండూ FHD వీడియో మాత్రమే తీస్తాయి). అయితే ఇందులో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉండటం ఒక మైనస్ పాయింట్.

POCO M7 P+

5. Infinix Note 50X

డిఫరెంట్ డిజైన్ మరియు బ్యాలెన్స్డ్ ఫీచర్లతో సుమారు రూ. 13,500 కే (6GB+128GB) ఇది లభిస్తోంది.

5500mAh బ్యాటరీ & 45W ఫాస్ట్ ఛార్జింగ్.
Dimensity 7300 చిప్‌సెట్ & స్మూత్ XOS 15 సాఫ్ట్‌వేర్ (2 Years Updates).

ఇందులో 50MP మెయిన్ కెమెరా ఉంది. అయితే ఇందులో FHD+ కి బదులు HD+ LCD డిస్ప్లే (120Hz) ఇవ్వడం గమనించాల్సిన విషయం.

Infinix Note 50X

Technician Opinion 🛠️

కొత్త ఫోన్ల పేరుతో బ్రాండ్స్ పాత ప్రాసెసర్లను, సింగిల్ స్పీకర్లను అంటగడుతున్న ఈ తరుణంలో.. పైన చెప్పిన మొబైల్స్ మాత్రమే ఒక సాధారణ యూజర్‌కు నిజమైన వాల్యూ ఇస్తాయి. మీకు హెవీ బ్యాటరీ ముఖ్యం అయితే Moto G57 Power లేదా T4x తీసుకోండి. లేదంటే మంచి కంటెంట్ వాచింగ్ (డిస్ప్లే) కోసం Lava Play Ultra ని బ్లైండ్ గా తీసుకోవచ్చు.

Final Verdict: ఎవరు ఏది కొనాలి?

బెస్ట్ ఆల్ రౌండర్స్: మీకు హెవీ బ్యాటరీ (7000mAh) మరియు మంచి ప్రాసెసర్ కావాలంటే Motorola G57 Power లేదా Vivo T4X వైపు వెళ్లండి.

బెస్ట్ డిస్ప్లే కోసం: మూవీస్ చూడటానికి బెస్ట్ AMOLED డిస్ప్లే కావాలంటే Lava Play Ultra తీసుకోవడం పర్ఫెక్ట్ ఛాయిస్.

తక్కువ బడ్జెట్ ఆప్షన్స్: మీ బడ్జెట్ 13 నుంచి 14 వేల మధ్యే ఉంటే POCO M7 P+ లేదా Infinix Note 50X ని పరిశీలించండి.

(ఒకవేళ మీ బడ్జెట్ ఎక్స్‌ట్రా ఒక 1000 రూపాయలు పెంచగలిగితే.. రూ. 16,000 లోపు ర్యాంక్‌లో Realme P4X లేదా Tecno Pova 7 కూడా ఎక్సలెంట్ ఆప్షన్స్ అవుతాయి!)

Join WhatsApp

Join Now

Sudheer Sayana

Sudheer S | Founder & Lead Author, Taja PointsI am a digital publisher and content creator committed to delivering accurate, reliable, and easy-to-understand information for Telugu readers. Through Taja Points, I share the latest updates on Government Jobs, Government Schemes, Education, and Technology, helping students, job seekers, and everyday citizens stay informed and make better decisions.

Leave a Comment