AP Jobs

Nandyal Anganwadi Recruitment 2026: టెన్త్ పాసైన మహిళలకు గుడ్ న్యూస్.. నంద్యాల జిల్లాలో 106 అంగన్‌వాడీ ఉద్యోగాలు!

April 15, 2026 5:49 PM
Nandyal Anganwadi Recruitment 2026 notification details for 10th pass women in AP

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. 10th pass jobs telugu కోసం ఎదురుచూస్తున్న స్థానిక మహిళలకు ఇది అద్భుతమైన అవకాశం. నంద్యాల జిల్లా పరిధిలోని వివిధ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న 106 అంగన్‌వాడీ కార్యకర్త (Anganwadi Worker) మరియు అంగన్‌వాడీ ఆయా (Helper) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ Nandyal Anganwadi Recruitment 2026 కి సంబంధించి ఎవరు అర్హులు, వయోపరిమితి, కావాల్సిన డాక్యుమెంట్లు మరియు ఎలా అప్లై చేయాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:

  • జిల్లా పేరు: నంద్యాల (Nandyal District, AP)
  • మొత్తం ఖాళీలు: 106
  • ఖాళీల విభజన: అంగన్‌వాడీ వర్కర్లు – 05, అంగన్‌వాడీ ఆయాలు (హెల్పర్స్) – 101.
  • అప్లికేషన్ విధానం: ఆఫ్‌లైన్ (నేరుగా వెళ్లి దరఖాస్తు ఇవ్వాలి)
  • అప్లికేషన్ ప్రారంభం: 14 ఏప్రిల్ 2026
  • చివరి తేదీ: 23 ఏప్రిల్ 2026 (సాయంత్రం 5 గంటల లోపు)

ఎవరు అప్లై చేయవచ్చు? (Eligibility):

  • విద్యార్హత: అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. (ఆయా పోస్టులకు టెన్త్ పాసైన వారు ఎవరూ లేకపోతే, తక్కువ చదువుకున్న వారిని కూడా పరిశీలిస్తారు).
  • స్థానికత & వివాహం: అభ్యర్థులు కచ్చితంగా వివాహితలై (పెళ్లయిన మహిళలై) ఉండాలి. మరియు ఏ అంగన్‌వాడీ సెంటర్ లో ఖాళీ ఉందో, ఆ సెంటర్ పరిధిలోనే (గ్రామం/వార్డు) స్థానికంగా నివాసం ఉంటూ ఉండాలి.

వయోపరిమితి (Age Limit)

అభ్యర్థుల వయసు 01-07-2025 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

గమనిక: గిరిజన/ఏజెన్సీ ప్రాంతాల్లోని అభ్యర్థులకు 21 ఏళ్ల వారు లేకపోతే, కనీస వయసు 18 సంవత్సరాలు ఉన్నా కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

Young Indian professional working in an Amazon operations center for Transportation Representative jobs in Andhra Pradesh 2026. No application fee required.
👉 AP నిరుద్యోగులకు పండుగ.. మన సొంత రాష్ట్రంలోనే ‘అమెజాన్’ ఉద్యోగాలు (డిగ్రీ చాలు)!

అప్లై చేసేటప్పుడు జతచేయాల్సిన జిరాక్స్ కాపీలు:

  • పుట్టిన తేదీ / వయసు ధృవీకరణ పత్రం (10th మార్క్స్ మెమో).
  • తాజా కుల ధృవీకరణ పత్రం (Caste Certificate).
  • 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు (TC తో సహా).
  • నివాస స్థల ధృవీకరణ పత్రం (Nativity Certificate).
  • వితంతువులు లేదా అనాథలైతే, వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు.
  • వికలాంగులైతే సదరం సర్టిఫికెట్ (SADAREM).
  • ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీలు.

Taja Points Technician Advice 💡

ఈ జాబ్స్ కి ఆన్‌లైన్ అప్లికేషన్ ఉండదు. కాబట్టి మీరు పైన చెప్పిన అన్ని సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్ తో సంతకం (Attestation) చేయించి.. ఏప్రిల్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీ దగ్గర్లోని శిశు అభివృద్ధి పథకం అధికారి (CDPO) కార్యాలయంలో నేరుగా వెళ్లి సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన లింక్స్ (Official Info)

ఖాళీల వివరాలు & Official PDFDownload Now
నంద్యాల జిల్లా వెబ్‌సైట్Click Here

మరిన్ని 10th Pass Jobs Telugu మరియు జెన్యూన్ ఉద్యోగ అప్‌డేట్స్ కోసం మా Taja Points వెబ్‌సైట్‌ని ప్రతిరోజూ ఫాలో అవ్వండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి హెల్ప్ చేయండి.

Join WhatsApp

Join Now

Sudheer Sayana

Sudheer S | Founder & Lead Author, Taja PointsI am a digital publisher and content creator committed to delivering accurate, reliable, and easy-to-understand information for Telugu readers. Through Taja Points, I share the latest updates on Government Jobs, Government Schemes, Education, and Technology, helping students, job seekers, and everyday citizens stay informed and make better decisions.

Leave a Comment