Technology

Best Phones Under ₹30,000: ఈ 6 ఫోన్లు మాత్రమే కొనండి! (2026 లిస్ట్)

January 21, 2026 11:22 AM

Best Smartphones Under ₹30,000 in 2026:

​మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం! ఎందుకంటే రాబోయే 3-4 నెలల్లో చిప్‌సెట్ ధరలు పెరగడం వల్ల ఫోన్ల రేట్లు పెరిగే అవకాశం ఉంది.

​ఈరోజు మార్కెట్లో రూ. 30,000 లోపు దొరుకుతున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్లను మీకోసం సెలెక్ట్ చేశాం. మేము ర్యాంకింగ్ ఇవ్వట్లేదు, కానీ మీ అవసరాన్ని బట్టి (కెమెరా, బ్యాటరీ, గేమింగ్) ఏది బెస్ట్టో చెప్తాం.

💡 ఫోన్ కొనేముందు ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి:

  1. స్టోరేజ్ (Storage): దయచేసి 128GB వేరియంట్ కొనకండి. ఇప్పుడున్న యాప్స్, ఫోటోల సైజుల వల్ల అది అస్సలు సరిపోదు. కనీసం 256GB ఉండేలా చూసుకోండి.
  2. ర్యామ్ (RAM): 8GB ఓకే, కానీ 12GB ఉంటే ఫ్యూచర్ లో స్లో అవ్వకుండా ఉంటుంది.
  3. పెర్ఫార్మెన్స్ (Score): మీరు గేమింగ్ లేదా హెవీ వర్క్ చేస్తే, ఫోన్ Antutu స్కోర్ 1.3 నుండి 1.4 మిలియన్ల మధ్యలో ఉండేలా చూసుకోండి.

🏆 Top 6 Best Phones List

1. Motorola Edge 70: (తేలికైన ఫోన్ & క్లీన్ UI)

​మీకు బరువు తక్కువగా ఉండే, చేతిలో ఇమిడిపోయే ఫోన్ కావాలంటే ఇదే నెంబర్ వన్ ఛాయిస్.

  • Display: 6.7-అంగుళాల 1.5K AMOLED స్క్రీన్.
  • Battery: 5000mAh బ్యాటరీ + 68W ఛార్జింగ్. హైలైట్ ఏంటంటే ఇందులో 15W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది.
  • Camera: వెనుక 50MP + 50MP, ముందు కూడా 50MP సెల్ఫీ.
  • Special: IP68/69 వాటర్ రెసిస్టెన్స్, క్లీన్ UI అనుభవం.
  • ధర: ఆఫర్లతో కలిపి సుమారు ₹28,999.

Motorola Edge 70

2. Realme GT 7T: (డబ్బుకు తగ్గ విలువ – Value For Money)

​తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే ఫోన్ ఇది.

  • Performance: ఇందులో Dimensity 8400 చిప్ ఉంది, గేమింగ్ కి సూపర్.
  • Display: 6.8-అంగుళాల 1.5K డిస్ప్లే.
  • Update: Realme UI 6.0 తో వస్తుంది, 3 ఏళ్ళ పాటు మేజర్ అప్డేట్స్ వస్తాయి.
  • Cooling: హీటింగ్ ఇష్యూస్ రాకుండా 360 డిగ్రీ కూలింగ్ ఉంది.
  • ధర: సుమారు ₹27,999 (ఆఫర్లలో ఇంకా తగ్గొచ్చు).

Realme GT 7T

3. iQOO Neo 10: (గేమింగ్ బీస్ట్ & 7000mAh బ్యాటరీ)

​మీకు పర్ఫార్మెన్స్, బ్యాటరీ తప్ప వేరేది ముఖ్యం కాదంటే ఇది తీసుకోండి.

  • Processor: పవర్ఫుల్ Snapdragon 8s Gen 4 ప్రాసెసర్.
  • Battery: సెగ్మెంట్ లోనే పెద్దది 7,000mAh బ్యాటరీ.
  • Charging: ఏకంగా 120W ఫాస్ట్ ఛార్జింగ్.
  • ధర: 8GB/128GB వేరియంట్ సుమారు ₹31,999. (స్టోరేజ్ తక్కువ, అది ఒక్కటే మైనస్).

iQOO Neo 10

4. Moto Edge 60 Pro: (కెమెరా లవర్స్ కోసం)

​మీకు పర్ఫార్మెన్స్ కంటే ఫోటోలు ముఖ్యం అయితే పాతదైనా ఇది బెస్ట్.

  • Camera Magic: 50MP (Main) + 50MP (Ultrawide) + 10MP (Telephoto/Zoom).
  • Display: 1.5K కర్వ్డ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్.
  • ధర: సేల్స్ లో ఇది ₹25,000 – ₹26,000 మధ్యలో దొరుకుతుంది.

Moto Edge 60 Pro

5. POCO F7: (అల్టిమేట్ ఆల్ రౌండర్)

​ఇది కొంచెం బరువుగా ఉంటుంది, కానీ ఫీచర్లు మాత్రం అదిరిపోతాయి.

  • Storage: బేస్ వేరియంట్ ఏకంగా 12GB RAM + 256GB స్టోరేజ్ తో వస్తుంది.
  • Battery: 7550mAh భారీ బ్యాటరీ + 90W ఛార్జింగ్.
  • Build: మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్, వైఫై 7 మరియు IP69 రేటింగ్.
  • ధర: సుమారు ₹31,999.

POCO F7

6. OnePlus Nord 5: (బ్యాలెన్స్డ్ ఛాయిస్)

​ఏదీ ఎక్కువ కాదు, ఏదీ తక్కువ కాదు.. అన్నీ సమపాళ్లలో కావాలంటే ఇది చూడండి.

  • Display: 6.83-అంగుళాల 1.5K డిస్ప్లే, 144Hz రీఫ్రెష్ రేట్.
  • Battery: 6800mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్.
  • Minus: ఇందులో IP65 రేటింగ్ మాత్రమే ఉంది (నీళ్ళలో వేయకూడదు).
  • ధర: ఆఫర్లలో ₹31,000 – ₹31,500.

OnePlus Nord 5

  • 🤔 చివరిగా ఏది కొనాలి? (Verdict)
  • గేమింగ్ & బ్యాటరీ కావాలంటే: iQOO Neo 10 లేదా POCO F7.
  • స్టైలిష్ & లైట్ వెయిట్ కావాలంటే: Moto Edge 70.
  • కెమెరా ముఖ్యం అయితే: Moto Edge 60 Pro.
  • తక్కువ ధరలో బెస్ట్ కావాలంటే: Realme GT 7T.

​మీరు ఏ ఫోన్ కొనాలని ఫిక్స్ అయ్యారు? కింద కామెంట్ చేయండి!

Sudheer Sayana

Sudheer S Founder & Lead Author, Taja Points "I am a passionate tech blogger dedicated to simplifying the latest mobile, gadget updates in Telugu. My goal is to provide authentic and easy-to-understand information to the common man through Taja Points."

Leave a Comment