ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాలకు (AP Govt Jobs 2026) ప్రిపేర్ అవుతున్న క్రీడాకారులకు (Sports Persons) ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసే విధానంలో భారీ మార్పులు తీసుకువస్తూ ‘GO Ms No. 23’ ని తాజాగా విడుదల చేసింది.
ఇప్పటివరకు క్రీడల్లో రాణించిన వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నేరుగా 3% రిజర్వేషన్ కింద ఉద్యోగాలు ఇస్తామని గతంలో (GO 18 ద్వారా) ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు వస్తుండటంతో.. ఆ పాత విధానాన్ని రద్దు చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టాలంటే ఏం చేయాలో కింద వివరంగా తెలుసుకుందాం.
- □ కొత్త జీవో నెంబర్: G.O.Ms.No. 23
- □ విభాగం: యువజన సర్వీసులు & క్రీడల శాఖ (YAT&C)
- □ అమలు: AP Police, Forest, Excise, PSU మరియు అన్ని ప్రభుత్వ శాఖలు
- □ రిజర్వేషన్: 3% (స్పోర్ట్స్ కోటా)
పాత విధానం (GO Ms No. 18) ఏం చెబుతోంది?
- ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ విభాగాలు, పోలీస్, అటవీశాఖ (Forest), ఎక్సైజ్ మరియు ఇతర శాఖల్లో భర్తీ చేసే ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించారు.
- దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక “సెలక్షన్ బోర్డు” ఏర్పాటు చేసి, నేషనల్/ఇంటర్నేషనల్ స్థాయిలో పతకాలు సాధించిన వారికి ఎలాంటి రాత పరీక్ష (Exams) లేకుండానే డైరెక్ట్ గా జాబ్స్ ఇస్తామని 2024 లో (GO No.18 ద్వారా) ప్రకటించారు.
కొత్త మార్పు (GO Ms No. 23) ఏంటి? ⚠️
ఎగ్జామ్స్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని, అలాగే చాలా మంది అభ్యర్థుల నుండి పిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఆ నిబంధనను సవరించింది (Amendment). కొత్త రూల్స్ ప్రకారం:
- స్పోర్ట్స్ కోటాలో 3% రిజర్వేషన్ ఎప్పటిలాగే ఉంటుంది. కానీ..
- ఎవరైతే క్రీడాకారులు ఈ 3% కోటా కింద జాబ్ కొట్టాలనుకుంటున్నారో.. వారు కచ్చితంగా సంబంధిత రిక్రూట్మెంట్ బోర్డు (ఉదాహరణకు: APPSC లేదా పోలీస్ బోర్డు) నిర్వహించే రాత పరీక్ష (Eligibility Test) రాసి అందులో అర్హత (Qualify) సాధించాల్సిందే!
- పరీక్ష రాసి క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఈ 3% రిజర్వేషన్ కింద ఉద్యోగాలు ఇస్తారు. ఇకపై పరీక్షలు లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరగదు.
SAAP కోచ్ పోస్టులకు మినహాయింపు!
అయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) లో భర్తీ చేసే గ్రేడ్-III కోచ్ (Grade III Coaches) పోస్టులకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. ఈ కోచ్ పోస్టులలో 50 శాతం ఖాళీలను జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులతో “సెలక్షన్ బోర్డు” ద్వారా ఎంపిక చేసి భర్తీ చేస్తారు.
సో, ఏపీలో పోలీస్, గ్రూప్స్ లేదా ఇతర ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా ప్రిపేర్ అవుతున్న స్పోర్ట్స్ అభ్యర్థులు ఇకపై కేవలం సర్టిఫికెట్స్ మీద ఆధారపడకుండా.. మిగతా అభ్యర్థుల్లాగే గట్టిగా చదివి రాతపరీక్ష పాస్ అవ్వాల్సిందే!
ముఖ్యమైన లింక్స్ (Important Links)
| Download GO Ms No. 23 PDF | Click Here |
| Join Our WhatsApp Group (AP Updates) | Click Here to Join |






