ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఖరీఫ్ కానుక ప్రకటించింది. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించి, లాభాలు పెంచే ఉద్దేశంతో SMAM (Sub-Mission on Agricultural Mechanization) 2025-26 పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్కీమ్ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ట్రాక్టర్లు, తదితర ఆధునిక వ్యవసాయ యంత్రాలపై ఏకంగా 50 శాతం సబ్సిడీ (Agriculture Subsidy) ఇస్తున్నారు.
కూలీల కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులు, ఈ యంత్రాలను ఉపయోగించి ఉత్పాదకత పెంచుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అసలు ఈ స్కీమ్ కి ఎవరు అర్హులు? ఏయే యంత్రాలు ఇస్తారు? ఎలా అప్లై చేసుకోవాలో కింద వివరంగా తెలుసుకుందాం.
- □ పథకం పేరు: SMAM Scheme 2025-26
- □ ప్రయోజనం: వ్యవసాయ యంత్రాలపై భారీ రాయితీ (సబ్సిడీ)
- □ సబ్సిడీ శాతం: 40% నుండి 50% వరకు
- □ దరఖాస్తు విధానం: ఆన్లైన్ (లేదా RBK ల ద్వారా)
ముఖ్యమైన తేదీలు (Important Dates)
ఈ పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. టైమ్ టేబుల్ ఇలా ఉంది:
| దశ (Stage) | ముఖ్య తేదీలు (Dates) |
|---|---|
| ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం | 05-05-2026 |
| దరఖాస్తుకు చివరి తేదీ | 19-05-2026 |
| లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక | 23-05-2026 నుండి 25-05-2026 |
| రైతు వాటా డబ్బుల చెల్లింపు | 26-05-2026 నుండి 09-06-2026 |
| యంత్రాల సరఫరా (Delivery) | 26-05-2026 నుండి 26-06-2026 |
ఎవరికి ఎంత సబ్సిడీ వస్తుంది? (Subsidy Details)
- 50% సబ్సిడీ: చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ (SC), ఎస్టీ (ST) మరియు మహిళా రైతులకు గరిష్టంగా 50% వరకు రాయితీ లభిస్తుంది.
- 40% సబ్సిడీ: ఇతర రైతులకు (జనరల్ కేటగిరీ) 40% వరకు సబ్సిడీ అందుతుంది.
ఎవరు అర్హులు? (Eligibility Criteria)
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సొంత భూమి కలిగిన రైతులు (Land Owners).
- RoFR (Recognition of Forest Rights) పట్టా కలిగిన రైతులు.
- CCRC కార్డు కలిగిన కౌలు రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు (కానీ గత మూడేళ్లలో కనీసం 3 సీజన్లు e-Panta లో పంట నమోదు చేసి ఉండాలి).
- ముఖ్య గమనిక: ఒక కుటుంబం నుండి ఒక్కరికి మాత్రమే ఛాన్స్. అలాగే పోయిన సంవత్సరం (2024-25) లో సబ్సిడీ తీసుకున్న వారు ఈసారి అప్లై చేయడానికి అనర్హులు.
ఏయే యంత్రాలు ఇస్తారు? (Machinery List)
ఈ పథకం కింద కేవలం ట్రాక్టర్లే కాకుండా వ్యవసాయానికి అవసరమైన అనేక యంత్రాలను ఎంచుకోవచ్చు:
- ట్రాక్టర్లు (Tractors < 40HP) మరియు పవర్ టిల్లర్లు (Power Tillers).
- ట్రాక్టర్ అనుబంధ పనిముట్లు (Tractor Drawn Implements).
- విత్తనాలు నాటే యంత్రాలు (Seeding & Planting Equipment).
- మందు కొట్టే స్ప్రేయర్లు (Sprayers).
- పంట కోత మరియు నూర్పిడి యంత్రాలు (Harvesting and Threshing).
కొత్త రూల్స్: GPS & QR కోడ్ తప్పనిసరి ⚠️
ఈసారి పారదర్శకత కోసం ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టింది.
- లక్ష రూపాయల కంటే ఎక్కువ విలువైన యంత్రాలకు GPS ట్రాకింగ్ సిస్టమ్ (Telematics) కచ్చితంగా ఉండాలి. దీనివల్ల యంత్రం ఎక్కడ వాడుతున్నారో అధికారులు ట్రాక్ చేస్తారు. దొంగదారుల్లో అమ్ముకోవడానికి వీల్లేదు!
- అలాగే ఇచ్చే ప్రతి యంత్రం 2026 లేటెస్ట్ మోడల్ అయి ఉండాలి. పాత మోడల్స్ ఇస్తే కుదరదు. దీనికోసం ప్రతి యంత్రంపై QR కోడ్ మరియు స్పెషల్ లేబుల్ ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి? & సెలెక్షన్ ప్రాసెస్
అర్హులైన రైతులు తమ గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలను (RSK) సంప్రదించి, అవసరమైన డాక్యుమెంట్స్ ఇచ్చి ఆన్లైన్ లో అప్లై చేయించుకోవచ్చు. ఒకవేళ దరఖాస్తులు ఎక్కువగా వస్తే.. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా కంప్యూటరైజ్డ్ లాటరీ సిస్టమ్ (Lottery) ద్వారా రైతులను ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన రైతులకు ఫోన్ కి SMS వస్తుంది. ఆ తర్వాత 15 రోజుల్లోపు రైతు తన వాటా డబ్బును ఆన్లైన్ ద్వారా చెల్లించి యంత్రాన్ని ఇంటికి తీసుకెళ్లొచ్చు.
ముఖ్యమైన లింక్స్ (Important Links)
| అఫీషియల్ వెబ్సైట్ & ఆన్లైన్ అప్లై లింక్ | Click Here to Apply |
| Join Our WhatsApp Group (AP Updates) | Click Here to Join |






