Tech Mobile Buying Guide

Realme 10000mAh Battery Phone: పవర్ బ్యాంక్ లు ఇక పక్కన పడేయండి.. రియల్ మీ “రాక్షసుడు” వచ్చేసాడు!

January 24, 2026 1:21 PM
"Realme P4 Power 5G smartphone with massive 10000mAh battery - World's first 10000mAh mobile launching in India on January 29"

స్మార్ట్ ఫోన్ చరిత్రలోనే అతిపెద్ద బ్యాటరీతో రియల్ మీ (Realme) సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Realme P4 Power 5G (Realme 10000mAh Battery Phone) ఇండియా లాంచ్ డేట్ ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

వచ్చే జనవరి 29, 2026 (January 29th) న ఈ ఫోన్ భారత మార్కెట్ లోకి అడుగుపెట్టబోతోంది. అసలు 10000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటి? ఇది నిజంగానే పవర్ బ్యాంక్ ని రీప్లేస్ చేస్తుందా? పూర్తి వివరాలు చూద్దాం.

10000mAh బ్యాటరీ – ఇది ఫోనా? పవర్ బ్యాంకా?

ఇప్పటివరకు మనం 5000mAh, లేదా మహా అయితే 6000mAh చూసాం. కానీ ఇందులో ఏకంగా 10001 mAh బ్యాటరీని అమర్చారు.

  • భయం వద్దు: ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే పేలిపోతుందేమో అని భయం అక్కర్లేదు. దీనికోసం రియల్ మీ “5-Layer Safety Protection” వాడింది.

  • సిరామిక్ కోటింగ్: బ్యాటరీ హీట్ అవ్వకుండా సిరామిక్ కోటింగ్ మరియు సిలికాన్ కార్బన్ టెక్నాలజీ (Silicon-Carbon Technology) వాడారు.

Realme P4 Power 5G smartphone with massive 10000mAh battery launching in India on January 29 - World's first 10000mAh mobile

రాక్షస పరీక్షలు (Extreme Durability Tests)

ఈ ఫోన్ ని మార్కెట్ లోకి తెచ్చే ముందు ఫ్యాక్టరీలో దీనిని నరకం చూపించారు:

  1. -40°C గడ్డకట్టే చలిలో: డీప్ ఫ్రీజర్ లో పెట్టినా బ్యాటరీ పనిచేసింది.

  2. 75°C మండుటెండలో: అధిక వేడిలో కూడా ఇది పేలలేదు, ఉబ్బలేదు.

  3. Drop Test: 1 మీటర్ ఎత్తు నుండి కింద పడేసినా, బ్యాటరీకి గానీ, ఫోన్ కి గానీ ఏం కాలేదు.

    Infinix Note Edge JBL Edition smartphone in Solar Orange color with bundled JBL MagPower Speaker launched in India
    👉 Infinix Note Edge JBL Edition Launch: ఫోన్‌తో పాటు JBL స్పీకర్ ఫ్రీగా!
  4. ఒత్తిడి పరీక్ష: దీని మీద నిల్చొని తొక్కినా కూడా (Pressure Test), బ్యాటరీ చెక్కుచెదరలేదు.

Realme 10000mAh Phone Top Features

FeatureSpecification
Battery Capacity10001 mAh (World’s First)
Charging Speed80W Fast Charging
Reverse Charging27W (ఐఫోన్ ని కూడా ఛార్జ్ చేయొచ్చు!)
Life Span8 Years (80% Health Guarantee)
Weight219 Grams (iPhone 17 Pro Max కంటే తేలిక!)
Warranty4 ఏళ్ల లోపు బ్యాటరీ పాడైతే Free Replacement

8 ఏళ్లు బ్యాటరీ లైఫ్? నిజమేనా?

సాధారణ ఫోన్లలో 1000 ఛార్జింగ్ సైకిల్స్ వస్తాయి. కానీ ఈ రియల్ మీ ఫోన్ లో 1650 సైకిల్స్ వస్తాయి. అంటే మీరు రోజుకొకసారి ఛార్జ్ చేసినా, 8 సంవత్సరాల పాటు బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ 4 ఏళ్లలోపు బ్యాటరీ హెల్త్ 80% కంటే తగ్గితే, రియల్ మీ ఉచితంగా కొత్త బ్యాటరీ వేసిస్తామని ఛాలెంజ్ చేస్తోంది!

రివర్స్ ఛార్జింగ్ (Reverse Charging)

మీ ఫ్రెండ్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందా? నో ప్రాబ్లం. మీ రియల్ మీ ఫోన్ కి కేబుల్ పెట్టి, అవతలి ఫోన్ కి కనెక్ట్ చేస్తే చాలు.. ఇది 27W స్పీడ్ తో పవర్ బ్యాంక్ లా ఛార్జ్ చేస్తుంది. ఐఫోన్ 16 ప్రో ని కేవలం 30 నిమిషాల్లో 50% ఛార్జ్ చేయగలదు.

ఎప్పుడు వస్తుంది? ధర ఎంత? (Launch Date & Price)

🇮🇳 India Launch Date Confirmed! రియల్ మీ తన అధికారిక వెబ్‌సైట్ లో తెలిపిన ప్రకారం, Realme P4 Power 5G ఇండియాలో January 29, 2026 న గ్రాండ్ గా లాంచ్ కాబోతోంది.

ధర ఎంత ఉండొచ్చు? (Expected Price) ఇది 10000mAh బ్యాటరీ మరియు 5G సపోర్ట్ తో వస్తోంది కాబట్టి, దీని ధర టెక్ వర్గాల అంచనా ప్రకారం:

  • Base Variant: ₹24,999 – ₹27,999 మధ్యలో ఉండే అవకాశం ఉంది.

  • లాంచ్ ఆఫర్స్ లో ఇది ఇంకా తక్కువకు రావొచ్చు. జనవరి 29న మధ్యాహ్నం 12 గంటలకు దీని అసలు ధర బయటపడుతుంది.

Realme P4 Power 5G smartphone with massive 10000mAh battery launching in India on January 29 - World's first 10000mAh mobile

నా అభిప్రాయం:

మీరు ట్రావెలర్స్ అయినా, గేమర్స్ అయినా.. లేదా పదే పదే ఛార్జింగ్ పెట్టడం చిరాకు అనుకునేవారైనా.. ఈ ఫోన్ మీ కోసమే పుట్టింది. ఇది ఇండియాకి వస్తే రికార్డులు బద్దలవ్వడం ఖాయం!

Join WhatsApp

Join Now

Sudheer Sayana

Sudheer S | Founder & Lead Author, Taja PointsI am a digital publisher and content creator committed to delivering accurate, reliable, and easy-to-understand information for Telugu readers. Through Taja Points, I share the latest updates on Government Jobs, Government Schemes, Education, and Technology, helping students, job seekers, and everyday citizens stay informed and make better decisions.

Leave a Comment